BUDGET 2025
1. బడ్జెట్ 2025 ప్రకారం 12 లక్షల లోపు పన్ను లేదని చెప్తూ ఈ స్లాబులు ఏంటి? అని అడుగుతున్నారు.
సమాధానం: కొత్త పన్ను విధానంలో 87A సెక్షన్ ప్రకారం టాక్స్ రిబేట్ ను 25000 నుండి 60000 వరకు పెంచారు... దీని ప్రకారం 12 లక్షల taxable income లోపల ఉన్న వారికి rebate వర్తిస్తుంది.
Note: No change in Old regime
-----------------------------
2. కొత్త టాక్స్ FY 2025-26 లో ఉద్యోగుల పన్ను ఏవిధముగా లెక్కించుకోవాలి. సేవింగ్స్, CPS, HRA, Loans ల మినహాయింపు ఉంటుందా?
సమాధానం: 12.75 లక్షల వరకు మినహాయింపు అంటే
కొత్త Tax Regime లో HRA, GPF , CPS, Life insurance, Health insurance , Housing loan Principal & Interest , LTC , Donations, PT ... etc, మినహాయింపులు ఉండవు.
మీ 12 నెలల గ్రాస్ సాలరీ నుండి
కేవలం 75000 స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే తీసేసి వచ్చే అమౌంట్ 12 లక్షల లోపు ఉంటే మాత్రమే మీరు టాక్స్ నుండి మినహాయింపు పొందుతారు.
-------------------------------------
3. రూ.12.75 లక్షల వరకు పన్ను ఎలా పడదంటే?
కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించక్కర్లేదని వెల్లడించారు. ప్రామాణిక తగ్గింపుతో (స్టాండర్డ్ డిడక్షన్) కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించనవసరం లేదని చెప్పారు.
కొత్త పన్ను విధానంలో శ్లాబులు సైతం సవరించారు. అయితే, రూ.12 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూనే రూ.4 లక్షల- రూ.8 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం పన్ను వర్తిస్తుందని చెబుతుండడంతో పలువురు అయోమయానికి లోనవుతున్నారు.
ఇది తెలియాలంటే పన్ను లెక్కింపు విధానం గురించి తెలియాలి.
కొత్త పన్ను విధానం (New Income Tax Regime)లో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు. ఒక ఏడాదిలో వచ్చే స్థూల ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి వేతనం ఏడాదికి రూ.12.75 లక్షలు అనుకుంటే అందులో ప్రామాణిక తగ్గింపు రూ.75 వేలు తొలగిస్తారు.
ఇప్పుడు రూ.12 లక్షలను పన్ను ఆదాయంగా పరిగణిస్తారు. ఈ పరిమితి వరకు వర్తించే పన్నును ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 87ఏ కింద రిబేట్‌ను మినహాయిస్తారు. అంటే మాఫీ చేసినట్లే. తాజా బడ్జెట్‌లో ఈ రిబేట్‌ను రూ.60 వేలుగా నిర్ణయించారు. కాబట్టి రూ.12.75 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు.
అయితే స్థూల ఆదాయం రూ.12.75 లక్షలకు ఒక్క రూపాయి దాటినా రిబేటు వర్తించదు. పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి వస్తుంది.
ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో పన్ను వర్తించని ఆదాయం రూ.7.75 లక్షలుగా (ప్రామాణిక తగ్గింపు రూ.75వేలుతో కలిపి) ఉంది. సెక్షన్ 87ఏ కింద రిబేట్ రూ.25వేలుగా ఉంది.
-----------------------------
* రూ.12 లక్షల ఆదాయంపై పన్ను లెక్కింపు ఇలా..!
ఆదాయపు పన్ను లెక్కింపును మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.
వ్యక్తి ఆదాయం రూ.12.75 లక్షలు అనుకుందాం.
రూ.75 వేలు ప్రామాణిక తగ్గింపును మినహాయిస్తే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.12. లక్షలు అవుతుంది.
దీనిపై శ్లాబుల (Income Tax Slab) ప్రకారం పన్ను వర్తింపజేస్తే దాదాపు రూ.60 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అదెలాగంటే..
రూ.0-4 లక్షలు - సున్నా; రూ.4- 8 లక్షలు - 5 శాతం (రూ.20 వేలు); రూ.8-12 లక్షలు - 10 శాతం (రూ.40 వేలు). అంటే మొత్తం రూ.60 వేలు వాస్తవానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
సెక్షన్ 87ఏ కింద రిబేట్ మినహాయిస్తే చెల్లించాల్సి పన్ను సున్నా అవుతుంది.
Model Tax Calculation
Example-1 | Example-2 |
---|---|
JSalary : 12,75,000 Less: SD: 75,000 | Salary : 13,75,000 Less: SD: 75,000 |
Taxable. Income : 12,00,000 TAX :👇 0-4L : NIL 4-8L (@5). : 20,000 8-12L(@10). : 40,000 ------------------------- Total tax. : 60,000 ------------------------ Tax Rebate. : 60,000 | Taxable. Income : 13,00,000 TAX :👇 0-4 L. : NIL 4-8L(@5). : 20,000 8-12L(@10). :40,000 12-13L(@15). : 15,000 -------------------------- Total tax. : 75,000 ------------------------ Tax Rebate. : NIL |
Tax to be paid. : NIL | Tax to be paid: 75,000 |
కొత్త పన్ను విధానంలో తాజా మార్పుల వల్ల రూ.12 లక్షల ఆదాయం పొందుతున్నవారికి రూ.80వేలు మేర ఆదాయపు పన్ను లబ్ధి చేకూరుతుందని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ (Union Budget) ప్రసంగంలో తెలిపారు.
రూ.18 లక్షలు ఆదాయపు పొందుతున్న వారికైతే రూ.70 వేలు (ప్రస్తుతం 30 శాతం పన్ను అమలౌతోంది) మేలు చేకూరుతుందన్నారు.
అదే రూ.25 లక్షలు ఆదాయం ఉన్న వారికి సవరించిన శ్లాబుల ప్రకారం దాదాపు రూ.1.10 లక్షలు లబ్ధి జరుగుతుందన్నారు.
దీనివల్ల ప్రత్యక్ష పన్ను వసూళ్ల రూపంలో లక్ష కోట్ల రూపాయలు, పరోక్ష పన్నుల రూపంలో రూ.2600 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు.
🔵గమనిక: సవరించిన పన్ను శ్లాబులు 2025-26 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) పాత పన్ను విధానం ప్రకారమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
0 వ్యాఖ్యలు:
Post a Comment