Sunday, February 23, 2025

INSTRUCTIONS TO CAST VOTE IN MLC ELECTIONS (TEACHER/GRADUATE)

INSTRUCTIONS TO CAST VOTE IN MLC ELECTIONS (TEACHER/GRADUATE)

ఉపాధ్యాయ/పట్టభద్రుల (MLC) ఓటు వేయడానికి సూచనలు


1) ఈ ఎన్నికల్లో వోటింగ్ మెషిన్ లు ఉండవు. ballot పేపర్ మాత్రమే ఉంటుంది. ballot పేపర్ పై పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు, ఫోటో ఉంటాయి 


2) ప్రాధాన్యతా క్రమం లో ఓటరు కు ఎక్కువ గా నచ్చిన అభ్యర్థి పేరు ఎదురుగా "1" నెంబర్ వేయాలి. అది కూడా బూత్ లో ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్ను మాత్రమే వాడాలి

 

3) తరువాత ప్రాధాన్యతా క్రమం లో తమకు ఇష్ట మైన వారికి 2,3,4..ఇలా వేయచ్చు లేదా ఒకటి వేసి ఇంకెవరికి వేయకుండా వదిలేయవచ్చు


4) ఒక్కరికే ఓటు వేయవలసిన అవసరం లేదు. ఎందరికైనా వేయచ్చు. ఇద్దరు అభ్యర్థులకు ఒకే నెంబర్ వేయరాదు


5) వరుస క్రమం తప్పరాదు. అనగా 1 వేయకుండా 2,3,4 వేయరాదు


6)1,2,3,4,5 లాంటి సంఖ్యలనే వేయాలి. రోమన్ సంఖ్యలు వాడరాదు. ఉదాహరణ కు I,II,III,IV, V ఇలాంటి సంఖ్యలు వేయరాదు


7) అంకెలు కాకుండా సున్నాలు చుట్టడం, ✔ పెట్టడం లాంటివి చేయరాదు


8) ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కి వెళ్లే సమయం లో ఎన్నికల సంఘం అనుమతించిన ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి


0 వ్యాఖ్యలు:

Post a Comment

Latest Updates

Search This Blog

PRC-2020

Softwares

MODEL PROCEEDINGS/ PROFORMAS



Medical Reimbursement



ROSTER



DA

Promotions


transfers


gurukulam


Top