Income Tax Services for employees

Income Tax Services for employees

Monday, July 28, 2025

SBI SALARY ACCOUNT-STATE GOVT SALARY PACKAGE (SGSP)

SBI SALARY ACCOUNT

STATE GOVT SALARY PACKAGE (SGSP)

SBI: స్టేట్‌ బ్యాంక్‌ శాలరీ అకౌంట్‌తో రూ.కోటి ఇన్సూరెన్స్‌ పూర్తిగా ఉచితం, చాలామందికి ఇది తెలీదు 


 *SBI శాలరీ ప్యాకేజ్ అకౌంట్ రకాలు:* 


- ఉద్యోగి జీతం రూ.2 లక్షల దాటితే రోడియం కేటగిరీలో శాలరీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.

- జీతం రూ.1 లక్ష- రూ.2 లక్షల వరకు ఉంటే ప్లాటినం అకౌంట్ ప్రారంభించొచ్చు.

- జీతం రూ.50,000-రూ.లక్ష వరకు ఉంటే డైమండ్ కేటగిరీ కిందకు వస్తారు.

- జీతం రూ.25,000-రూ.50,000 వరకు ఉంటే గోల్డ్ విభాగంలో ఖాతా ప్రారంభించొచ్చు.

- జీతం రూ.10,000-రూ.25,000 వరకు ఉంటే సిల్వర్ కేటగిరీలో అకౌంట్ తీసుకోవచ్చు. 

- ఈ కేటగిరీలను బట్టి, బ్యాంక్ అందించే ప్రయోజనాల్లో కొన్ని తేడాలు ఉంటాయి. ప్రతి ప్రయోజనాన్ని రూపాయి ఖర్చు లేకుండా అందుకోవచ్చు.


 *SBI శాలరీ అకౌంట్ ప్రయోజనాలు:* 


- ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఖాతాలో ఒక్క రూపాయి బ్యాలెన్స్ లేకపోయినా పెనాల్టీ ఉండదు.

- మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఛార్జీలు లేవు.

- మీ అకౌంట్ కోసం ఫ్యాన్సీ నంబర్ తీసుకోవచ్చు.

- ఆటో స్వీప్ ఫెసిలిటీ ఉంటుంది. ఇది ఐచ్ఛికం. మీ అకౌంట్లో మీ అవసరానికి మించి డబ్బు ఉంటే, ఈ ఆప్షన్ ఎంచుకున్నప్పుడు, మిగిలిన డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళుతుంది. మీకు అవసరమైనప్పుడు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఆ - డబ్బును వెనక్కుతీసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నన్ని రోజులకు మీకు వడ్డీ లభిస్తుంది.

- సాధారణ కస్టమర్ల కంటే ప్రత్యేకమైన ప్రయోజనాలతో ఉచిత డెబిట్ కార్డ్ వస్తుంది.

- భారతదేశంలోని SBI లేదా ఇతర బ్యాంకుల ATMల్లో ఎన్నిసార్లయినా డబ్బు తీసుకోవచ్చు, ఛార్జీలు వర్తించవు.

- శాలరీ కేటగిరీని బట్టి బ్యాంక్ నుంచి ఇంటర్నేషనల్ రోడియం/ప్లాటినం/డైమండ్/గోల్డ్/సిల్వర్ డెబిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఇది ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్. విదేశాలకు వెళ్లినప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు. విదేశాల్లో ఏటీఎంలోకి వెళ్లినప్పుడు మీ ఖాతాలోని రూపాయలు ఆటోమేటిక్గా ఆ దేశపు కరెన్సీలోకి మారి, ఆ కరెన్సీ ఏటీఎం నుంచి వస్తుంది.

- క్రెడిట్ కార్డ్ మీద కూడా ప్రత్యేక బెనిఫిట్స్ అందుతాయి.

- డిమాండ్ డ్రాఫ్ట్ (DD) ఛార్జీల నుంచి 100% మినహాయింపు ఉంటుంది. ఒక నెలలో ఎన్ని డీడీలయినా తీసుకోవచ్చు.

- నెలకు 25 చెక్ లీవ్స్ వరకు తీసుకోవచ్చు, దీనికి కూడా ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.

- ఆన్లైన్ RTGS / NEFT ఛార్జీల నుంచి మినహాయింపు.

- మిగిలినవారి కంటే తక్కువ వడ్డీ రేట్లకు వ్యక్తిగత రుణాలు (SBI Personal Loan), కారు లోన్ (SBI Car Loan), గృహ రుణాలు (SBI Home Loan) అందుబాటులో ఉంటాయి.

- ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది. జీతం రావడం ఆలస్యమైన సందర్భాల్లో దీనిని ఉపయోగించుకోవచ్చు. ప్లాటినం కేటగిరీలో ఉన్న ఉద్యోగులు రూ.2 లక్షలు వరకు తీసుకోవచ్చు. డైమండ్ కేటగిరీలో ఉన్నవాళ్లు గరిష్టంగా రూ.1.50 లక్షలు, గోల్డ్ విభాగంలోని వ్యక్తులు రూ.75,000 వరకు ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. సిల్వర్ కేటగిరీ వాళ్లకు ఈ సౌకర్యం లేదు.

- వార్షిక లాకర్ అద్దె ఛార్జీలపై రాయితీ కూడా లభిస్తుంది. ప్లాటినం వాళ్లకు ఏడాదికి 25% డిస్కౌంట్, డైమండ్ వాళ్లకు 15% డిస్కౌంట్ ఉంటుంది. 

- OTT, ఫుడ్ అగ్రిగేటర్స్ (జొమాటో, స్విగ్గీ వంటివి) సబ్స్క్రిప్షన్లను కూడా కొన్నాళ్ల పాటు ఉచితంగా అందుకోవచ్చు. 

- మూవీ టిక్కెట్ల బుకింగ్ సమయంలో డిస్కౌంట్స్ లభిస్తాయి. 

- స్పా, జిమ్, గోల్ఫ్ క్లబ్ వంటి వాటిల్లోకి కాప్లిమెంటరీ విజిట్స్ లభిస్తాయి.

- శాలరీ కేటగిరీని బట్టి, మీ డెబిట్ కార్డ్ ద్వారా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్ల్లోకి ఉచిత ప్రవేశం లభిస్తుంది.


 *కోటి రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్* 


శాలరీ అకౌంట్ హోల్డర్కు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, ప్రీమియం డబ్బును బ్యాంక్ కడుతుంది. ఏదైనా ప్రమాదంలో ఖాతాదారు మరణిస్తే బ్యాంక్ నుంచి 30 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో లభిస్తాయి. అదనంగా, డెబిట్ కార్డ్ మీద కూడా బీమా ఉంటుంది. డెబిట్ కార్డ్ నుంచి కవరేజ్ రూపంలో మరో రూ.10 లక్షల వరకు వస్తాయి. మొత్తంగా కలిపి రూ.40 లక్షల వరకు ఆ కుటుంబానికి అందుతాయి. క్లెయిమ్ చేసుకున్న 15 రోజులలోపు డబ్బులు వస్తాయి. ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.30 లక్షలు బ్యాంక్ నుంచి అందుతాయి. చాలామందికి ఈ విషయం తెలీక క్లెయిమ్ చేయడం లేదు.


శాలరీ అకౌంట్ హోల్డర్కు కోటి రూపాయల వరకు ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. అన్ని కేటగిరీల వాళ్లకు ఈ కవరేజ్ ఉంటుంది. దీనికి అదనంగా, ATM కార్డ్ మీద కూడా ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కార్డ్ రకాన్ని బట్టి వచ్చే కవరేజ్ మొత్తం మారుతుంది.


 *SBI అందించే వివిధ రకాల శాలరీ ఖాతా ప్యాకేజ్లు ఏమిటి?* 


సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ ప్యాకేజ్ (CGSP)

స్టేట్ గవర్నమెంట్ శాలరీస్ ప్యాకేజ్ (SGSP)

రైల్వే శాలరీ ప్యాకేజ్ (RSP)

డిఫెన్స్ శాలరీ ప్యాకేజ్ (DSP)

సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ శాలరీ ప్యాకేజ్ (CAPSP)

పోలీస్ శాలరీస్ ప్యాకేజ్ (PSP)

ఇండియన్ కోస్ట్ గార్డ్ శాలరీ ప్యాకేజ్ (ICGSP)

కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ (CSP)

ప్రారంభ శాలరీ ప్యాకేజ్ ఖాతా (SUSP)


జీతం పొందే వ్యక్తి నేరుగా బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లిగానీ, YONO యాప్ ద్వారా గానీ జీతపు ఖాతా తెరవొచ్చు.


 *శాలరీ అకౌంట్ తెరవడానికి అవసరమైన పత్రాలు:* 


పాస్పోర్ట్ సైజ్ ఫోటో

పాన్ కార్డ్ కాపీ

వ్యక్తిగత గుర్తింపు & చిరునామా రుజువు పత్రాలు

ఉద్యోగి ఐడీ కార్డ్ జిరాక్స్

సర్వీస్ సర్టిఫికెట్

తాజా పే స్లిప్


 *ఇప్పటికే ఉన్న సేవింగ్స్ ఖాతాను శాలరీ అకౌంట్గా మార్చొచ్చా?* 


మార్చొచ్చు. SBIలో ఇప్పటికే ఉన్న సేవింగ్స్ ఖాతాను జీతం ప్యాకేజ్ ఖాతాగా మార్చొచ్చు. ఇందుకోసం పైన చెప్పిన పత్రాలను బ్యాంక్కు సమర్పిస్తే చాలు.

0 వ్యాఖ్యలు:

Post a Comment

Latest Updates

Search This Blog

PRC-2020

Softwares

MODEL PROCEEDINGS/ PROFORMAS



Medical Reimbursement



ROSTER



DA

Promotions


transfers


gurukulam


Top