Wednesday, April 22, 2026

వేసవిలో సంపాదిత సెలవులు పొందడం ఎలా ?

 *వేసవిలో సంపాదిత సెలవులు పొందడం ఎలా ?*


🔖 పాఠశాలలకు వేసవి సెలవుల తరువాత ఉపాధ్యాయుల యొక్క సేవలను వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకునే సందర్భంలో మంజూరుచేసే సెలవులను "సంపాదిత సెలవులు" అందురు.


🔖 15 రొజులకు మించిన విరామం గల ఉద్యోగులకు ఫండమెంటల్ రూల్ 82(b) ప్రకారం ఇటువంటి సెలవులు మంజూరు చేస్తారు.




🔖 వెకేషన్ కాలంలో ఉపాధ్యాయులకు ఎన్నికలు,జనాభా గణన, జనాభా ఓట్ల జాబిత తయారీ,పరీక్షలు మొదలగు విధులు నిర్వర్తించినపుడు నియామక అధికారి ధృవపత్రం ఆధారంగా సెలవులు మంజూరుచేస్తారు.

*(G.O.Ms.No.35 Dt:16-1-1981)*

*(G.O.Ms.No.151 Dt:14-11-2000)*

*(G.O.Ms.No.174 Dt:19-12-2000)*


🔖 వెకేషన్ కాలంలో ఎన్ని రోజులు పనిచేస్తే ఆ రోజులకు దామాషా పద్దతిలో మాత్రమే సెలవులు మంజూరుచేస్తారు.

*(G.O.Ms.No.114 Dt:28-4-2005)*


🔖 సంబంధిత శాఖాధికారి ఉత్తర్వుల ఆధారంగా ప్రాధమిక, ప్రాధమికోన్నత  పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మండల విద్యాధికారులు,ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు ఇట్టి సెలవులు మంజూరు చేసి సర్వీసు పుస్తకములో నమోదుచేస్తారు.

*(Rc.No.03/plg.1/2020 Dt:21.1.2020*


🔖 FR-82 లోని సబ్ రూల్.6 ప్రకారం వినియోగించుకున్న వేసవి సెలవులు 15 రోజుల కన్నా  తక్కువ ఉన్నప్పుడు మొత్తం వేసవి సెలవులు కోల్పోయినట్లుగా భావించి 30 సంపాదిత సెలవులు (24+6) జమచేయబడతాయి. జనాభా లెక్కల సేకరణ మే 11 నుండి జూన్ 11 వరకు అనగా 31 రోజులు వినియోగించుకున్న వేసవి సెలవులు 49-31=18 కావున ELs దామాషా పద్ధతిలో మంజూరు చేయబడతాయి. 31 రోజులకు గానూ 17 రోజుల సంపాదిత సెలవులు మంజూరు చేయబడతాయి.


🔖 వేసవి సెలవులు 49

రోజులు ప్రకటించిన సందర్భంలో  సంపాదిత సెలవులు మంజూరుచేయు విధానం:


✳ సూత్రం: ✳


డ్యూటీ కాలము x 1/11-(365x1)/11-(27xవాడుకున్న వేసవి సెలవులు /మొత్తం వేసవి సెలవులు)-6


💥పనిచేసిన రోజులు-సంపాదిత సెలవులు 💥


>1-1


>2-1


>3-2


>4-2


>5-3


>6-3


>7-4


>8-5


>9-5


>10-6


>11-6


>12-7


>13-7


>14-8


>15-8


>16-9


>17-10


>18-10


>19-11


>20-11


>21-12


>22-12


>23-13


>24-13


>25-14


>26-15


>27-15


>28-16


>29-16


>30-17


>31-17


>32-18


>33-18


>34-19


>35-19


>36-20


>37-21


>38-21


>39-22


>40-22


>41-23


>42-23


>43,44,45,46,47,48,49-24 రోజులు

0 వ్యాఖ్యలు:

Post a Comment

Latest Updates

Search This Blog

PRC-2020

Softwares

MODEL PROCEEDINGS/ PROFORMAS



Medical Reimbursement



ROSTER



DA

Promotions


transfers


gurukulam


Top