ఆకస్మికేతర సెలవు (OCL) కు Prefix, Suffix రెండూ వర్తిస్తాయా?
మా నల్లగొండ హైస్కూల్లో నాతో కల్సి పనిచేస్తున్న A.రవీందర్ రెడ్డి SA (Maths) గారు తన అవసరాల రీత్యా డిసెంబర్ 27 నుంచి 30 వరకు నాలుగు రోజులు సెలవు పెట్టారు. అయితే, డిసెంబర్ 24,25,26 తేదీలు ప్రభుత్వ సెలవులు! అదేవిధంగా 31 డిసెంబర్ 2017 మరియు 1st జనవరి 2018 కూడా ప్రభుత్వ సెలవు రోజులే! అంటే... లీవ్ పీరియడ్ కి ముందు మూడు రోజులు... వెనకాల రెండు రోజులు జనరల్ హాలిడేస్ ఉన్నాయన్నమాట! దీంతో.... ముందున్న మూడు జనరల్ హాలిడేస్ ని Prefix, వెనకనున్న రెండు జనరల్ హాలిడేస్ ని Suffix చేసుకోవడానికి అనుమతినిచ్చి.... డిసెంబర్ 27 నుంచి 30 వరకు నాలుగు రోజులకు (4X2=8Days) కమ్యూటేడ్ లీవ్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేశాను. Prefix మరియు Suffix రెండూ ఒకేసారి అమలుచేస్తూ ప్రొసీడింగ్ తీసి పోస్టు చేయాలని ఎంతోకాలంగా నేను ఎదురుచూస్తున్నా! ఇన్నేళ్లకు అవకాశం వచ్చింది. ఎందుకంటే... ఆకస్మికేతర సెలవు (OCL) కు Prefix, Suffix రెండూ వర్తింపజేయాలని ఎన్నిసార్లు చెప్పినా... కొందరికి ఇంకా అనుమానమే. కొందరు ... ఒకేసారి Prefix, Suffix లు వర్తించవని... ఏదో ఒకటి మాత్రమే వర్తింపజేయాలని సమావేశాల్లో పనిగట్టుకొని తప్పుడు సమాచారం ఇవ్వడంతో.... నాబోటి వాళ్ళు ఎన్నిసార్లు... ఎన్ని విధాలుగా చెప్పి చూసినా.... కొంతమంది టీచర్లు, హెచ్ఎంలు, ఎంఈవోలు గందరగోళంలో పడుతున్న మాట వాస్తవం. Prefix, Suffix రెండింటినీ ఒకేసారి నిర్భయంగా అమలు చెయ్యొచ్చు. ఈవిషయాన్ని స్పష్టంగా చెప్పడం కోసమే ఈ పోస్టింగ్!
-ఎం.ప్రతాపరెడ్డి. Rtd Gazzetted HM, Karimnagar
https://www.facebook.com/share/p/1ErmaZoTV5/