సందేహాలు - సమాధానాలు
✍️ ప్రశ్న:180 days తరువాత ఎందుకు HRA ఇవ్వకూడదు అని రూల్ frame చేశారు. ఏమైనా logic ఉందా?
సమాధానము:
*కంటిన్యూ గా 180 రోజులకు మించి ఒక ఉద్యోగి సెలవులో ఉంటే, ఆ పోస్టు ఖాళీగా పరిగణించాల్సి ఉంటుంది. దానిని వేరే వారితో ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సెలవులో ఉన్న ఉద్యోగి కు పోస్టింగ్ ఉండదు. 180 రోజుల సెలవు అనంతరం తిరిగి విధుల్లో చేరాలని అంటే నేరుగా తన పాత స్థానానికి వెళ్లి చేరడం కుదరదు. నియామక అధికారి నుండి పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఆ ఉద్యోగి పాత ప్లేస్ లోనే ఇవ్వవచ్చు. లేదా వేరే ప్లేస్ కూడా మార్చవచ్చు.
*అసలు ఉద్యోగికి HRA అనేది ఇవ్వడానికి కారణం, ఉద్యోగి పని చేసే స్థానం లో నివాసం ఉండటానికి ఇచ్చే అలవెన్స్. ఉద్యోగికి పోస్టింగ్ లేనపుడు ఇక స్థానికంగా నివాసం ఉండటం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. అలాగే HRA ఇవ్వాల్సిన అవసరం లేదు.
*దీనికి మరో ఉదాహరణ. మనం హాఫ్ పే లీవ్ పెడతాం. హాఫ్ పే లీవ్ అయినా కూడా ఆరు నెలల వరకు HRA ఫుల్ ఇస్తారు. ఎందుకు అది కూడా హాఫ్ ఇవ్వాలి కదా!
*ఎందుకంటే ఆరునెలల వరకు ఉద్యోగి పోస్టింగ్ అదే ప్లేస్ లో ఉంటుంది. అందువల్ల అతను అక్కడే నివాసం ఉండాలి. అందువల్ల HRA తగ్గించరు.
*అసలు ఆరు నెలలు సెలవులో ఉంటే దానిని ఖాళీగా ఎందుకు పరిగణించాలి? ఒక పోస్టులో ఉన్న ఉద్యోగి సుదీర్ఘ కాలం సెలవులోనే ఉంది పోతే దానిని ఖాళీ గా చూపించకపోతే వేరే వారిని వేసుకునే అవకాశం కూడా ఉండదు. 100 మంది ఉండే ఆఫీస్ లో ఇద్దరు, ముగ్గురు సెలవులో ఉంటే అడ్జస్ట్ కావచ్చు.
*ఇద్దరు ముగ్గురు ఉండే ఆఫీస్ లో ఒకరు దీర్ఘకాలం సెలవులో ఉంటే ఎలా అడ్జస్ట్ చేసుకోగలరు? ఆ ఉద్యోగి జాయిన్ కారు. వేరే ఉద్యోగిని పోస్ట్ చేయలేరు. Incharge/ FAC లతో నడిపించాల్సి ఉంటుంది.
*ఇక్కడ మన FAC నిబంధన కూడా చూడండి. Fac అలవెన్స్ అనేది కూడా గరిష్టంగా ఆరు నెలల వరకే ఇస్తారు. ఆ తరువాత ఇవ్వరు.
*దీనికి కారణం ఏమిటి? ఆరు నెలల వరకు ఆ పోస్తుని భర్తీ చేసుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు. కేవలం ఇన్చార్జి లేదా FAC ద్వారానే నడిపించాల్సిన అవసరం ఉంటుంది. ఆరు నెలలు దాటితే ఆ పోస్టుని భర్తీ చేసుకునే అవశ్యకత ఉంటుంది కాబట్టి, ఆరు నెలల తరువాత FAC అలవెన్స్ కూడా ఇవ్వరు.*
*ఇక్కడ మరో ఉదాహరణ కూడా చూడవచ్చు. ఎవరైనా ఉద్యోగి సస్పెండ్ అయితే అతనికి హాఫ్ పే లీవ్ కు సమానమైన మొత్తం సబ్సిస్తన్స్ అలవెన్స్ గా చెల్లిస్తారు. ఇక్కడ సెలవు లో ఉద్యోగి తరహాలోనే HRA full గా ఇస్తారు. అయితే లీవ్ లో ఉన్న ఉద్యోగికి ఆరు నెలల తరువాత HRA నిలిపివేసినట్లు, సస్పెండ్ అయిన ఉద్యోగికి ఆరు నెలల తరువాత HRA అపరు. రెండేళ్ళు అయినా మూడేళ్లు అయినా HRA ఇస్తారు. దానికి కారణం సస్పెండ్ ఆయిన ఉద్యోగి తాను చివర పని చేసిన ప్రదేశాన్ని వదిలి వెళ్లకూడదు. అక్కడే నివాసం ఉండాలి. ప్రతీ నెలా అలా ఉంటున్నట్లు డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. స్థానికంగానే ఉండాలనే నిర్బంధం ఉంది కాబట్టి అతనికి ఎంతకాలం అయినా HRA చెల్లిస్తారు.
*ఏదైనా ఒక రూల్ ఏర్పాటు వెనుక ఎంతో లోతు ఉంటుంది. కేవలం ఉద్యోగి బెనిఫిట్ కోణం లోనే చూడకూడదు.
0 వ్యాఖ్యలు:
Post a Comment