సందేహాలు - సమాధానాలు
✍️ ప్రశ్న: సర్, నా CPS ఎకౌంటులో 25% విత్ డ్రా పెడితే 1లక్ష రూపాయలు వస్తుంది. నాకు ఇంకా28 సంవత్సరాల సర్వీసు ఉంది. ఇప్పుడు ఆ లక్ష రూపాయలను 28 సంవత్సరాలకి మ్యూచువల్ ఫండ్ లో పెడితే CPS కన్నా బెటర్ గా రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అలాగే NPS లోని ఎమౌంట్ తీసి మ్యూచువల్ ఫండ్లలో పెట్టడం సరైనదేనా? తప్పుడు ఆలోచన అంటారా? తెలుపగలరు.
సమాధానం:
*Depends upon so many factors.
*సాధారణంగా గత 35 ఏళ్లు గా ఉన్న ప్రభుత్వ విధానాల ఆధారంగా (ఫ్రీ ట్రేడ్ పాలసీ) వల్ల స్టాక్స్, mutual funds అనేవి ఎప్పుడూ పెరుగుతూనే ఉన్నాయి. కానీ, దీనికి ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. ఏదైనా కారణం చేత ప్రభుత్వ విధానాలు మారితే ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు.
*అంతర్జాతీయ పరిస్థితులు, ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు, యుద్ధ వాతావరణం ఇలాంటి అనేక అంశాలు వీటిని ప్రభావితం చేయగలవు.
*అందువల్ల దీర్ఘ కాలిక భవిష్యత్తు గురించి ఎవరూ జాతకాలు చెప్పలేరు.
*ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒకటవ తేదీ నా జీతం వస్తుంది. ఆరు నెలలకు ఒక DA వస్తుంది. ఏడాదికి ఇంక్రిమెంట్, ఐదేళ్లకు PRC, ప్రమోషన్ లు, అవి రాకపోతే ఆటోమాటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్స్, అనేక రకాల లోన్స్, రిటైర్ అయితే లక్షల రూపాయల సొమ్ము వెంటనే వచ్చేస్తాయి అనే స్థితి నుండి ఆర్ధిక నిర్వహణ సరిగా చేయడం లో ప్రభుత్వాలు విఫలం అయితే మనం ఇప్పుడు చూస్తున పరిస్థితులకు చాలా స్వల్ప కాలంలో మారిపోయాయి.
*అలాగే MUTUAL FUNDS కూడా ప్రభుత్వ విధానాల పై ఆధారపడి ఉంటుంది. ఉదేశ్య పూర్వకంగా లేక అవగాహన లోపంతో తీసుకునే కొన్ని నిర్ణయాలు వీటిని తీవ్రంగా ప్రభావితం చేయగలవు.
*CPS లో డిఫాల్ట్ ఆప్షన్ లో మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాట తక్కువ కాబట్టి నష్ట భయం చాలా తక్కువ ఉంటుంది. అలాగే భారీ గా లాభాలు వచ్చే అవకాశం తక్కువ.
*Mutual Funds కు వెళితే నష్ట భయం పెరుగుతుంది. లాభాలు వచ్చే అవకాశం పెరుగుతుంది.
*షేర్స్ లోకి వెళితే నష్ట భయం మరింతగా పెరుగుతుంది. లాభాలు వచ్చే అవకాశం భారీగా ఉంటుంది.
*ఇక crypto currency ల జోలికి వెళితే రాత్రి కి రాత్రి కుబేరుడు అయిపోవచ్చు (1% కూడా ఆ ఛాన్స్ ఉండదు). అంతే వేగం గా మొత్తం పొగొట్టుకోవచ్చు. (అత్యధిక శాతం పోగొట్టుకునే వారే ఉంటారు)
*నేను అయితే NPS జోలికి వెళ్ళవద్దు అని సజెస్ట్ చేస్తాను. అది మీకు బేసిక్ సెక్యూరిటీ ఇస్తుంది.
*మీరు ఎంత వీలైతే అంతా పర్సనల్ సేవింగ్స్ ను mutual funds లో invest చేయండి.
0 వ్యాఖ్యలు:
Post a Comment