PRAN అకౌంట్ లో లాగిన్ కావాలంటే నా రిజిస్టర్ మొబైల్ నెంబర్ ప్రస్తుతం నాతో లేదు. మరి ఏవిధంగా లాగిన్ కావాలి?✍️
💥CPS ఉద్యోగులు తమ మొబైల్ నెంబర్ మార్చుకోవాలంటే S-2 ఫారం పూర్తి చేసి మీ DDO తో అటెస్టెడ్ చేయించి మీ సంబంధిత STO లో అందచేయాలి.
➡️S-2 ఫారంను మనం ఎందుకు దరఖాస్తు చేసుకుంటామంటే గతములో మనం PRAN అప్లికేషన్ పూర్తి చేసినపుడు ఇచ్చిన సమాచారంలో ఏమన్నా మార్పులు చేసుకోవాలి అంటే S2 ఫారంను దరఖాస్తు చేసుకోవడం తప్పని సరి.
ప్రతి CPS ఉద్యోగి తమ పేరులో దోషాల సవరణ, మొబైల్ నెంబర్,మెయిల్ ID, నామినీ మార్పు,బ్యాంక్ డీటెయిల్స్ మార్పు (ఏ సమాచారం మార్పు) చేసుకోవడానికైనా S-2 ఫారం పూర్తి చేసి STO లో సమర్పించాలి.(Gurukulam employees should submit it in Head Office).
💥S2 FORM పై వివరణ
*S2 FORM బ్లాక్ పెన్ తో మాత్రమే పూరించాలి.మరియు మనం ఏ వివరాలైతే మార్చాలనుకుంటున్నామో వాటికెదురుగా లెఫ్ట్ సైడ్ లో ఉన్న బాక్స్ లో టిక్ చేసి మన వివరాలు నమోదు చేయాలి.
ఇందులో SECTION A, B,C,D లు ఉంటాయి.
SECTION A
Changes or Correction in Personal details
➡️ఇందులో మన పేరు, తండ్రి పేరు,పాన్ నెంబర్,Present Address, Permanent Address,మొబైల్ నెంబర్,Email ID, Bank Details, Value Added Service మొదలగు సమాచారంతో కూడిన COLOUMNS ఉంటాయి
*1. _మన PRAN కార్డ్ నందు మన SURNAME కానీ... మన పేరు కానీ... మన తండ్రి గారి పేరు కానీ... తప్పుగా ముద్రితమై ఉంటే S2 ఫారం దరఖాస్తు చేసుకొని మార్పు చేసుకొనవచ్చును.*
*2. _గతంలో PRAN అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్న సమయంలో మనకి పాన్ నెంబర్ లేకుండా కొత్తగా పాన్ నెంబర్ పొందినట్లైతే S2 ఫారం ద్వారా మన పాన్ నెంబర్ ను PRAN అకౌంట్ కు లింక్ చేసుకోవచ్చు.*
*3. గతములో ఇచ్చిన అడ్రస్ ను ఇపుడు మార్చుకోవాలి అన్నా S2 ద్వారా మార్పు చేసుకోవచ్చు.*
*4. గతములో మొబైల్ నెంబర్ ఇవ్వకున్నా... ఇచ్చిన మొబైల్ నెంబర్ మారి యున్నా.. కొత్త మొబైల్ నెంబర్ ను S2 ఫారం ద్వారా మార్పు చేసుకోవచ్చు.*
*5. గతములో Email ID ఇవ్వకున్నా.. ఇపుడు కొత్తగా Email ID ని నమోదు చేసుకోవాలి అన్నా... S2 ఫారం తప్పని సరి.*
*6. గతములో ఇచ్చిన BANK అకౌంట్ నెంబర్ గాని మారినట్లైనా... గతములో ఇచ్చిన BANK అకౌంట్ ను కనుక వేరే శాఖకు మార్చుకున్నా... కొత్త శాఖ యొక్క MICR ని కూడా S2 ఫారం ద్వారా మార్చుకోవచ్చును.*
*➡️పాక్షిక ఉపసంహరణ (Partial withdraw) కు అప్లై చేసుకున్న సందర్భంలో బ్యాంక్ డీటెయిల్స్ అప్ డేట్ చేసుకొన్న తర్వాత అప్లై చేసుకోమని సూచిస్తుంది .కావున ప్రతి ఒక్క CPS ఉద్యోగి తమ బ్యాంక్ బ్రాంచ్ పేరు ( SBH నుండి SBI), బ్యాంక్ IFSC కోడ్ కూడా మార్చుకోవాలి.దీనికి గాను మళ్ళీ S-2 ఫారం పూర్తి చేసి STO లో ఇవ్వాలి. (Gurukulam employees should submit it in Head Office). ఈ సందర్భంలో ఫారంతో పాటు బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్స్ జత పరచాలి.*
*7. కొత్తగా మొబైల్ నెంబర్,Email ID లను మార్చుకోవాలన్నా ఇక్కడ నమోదు చేసి Value Added Services COLOUMN వద్ద YES అని టిక్ మార్కుని నమోదు చేస్తేనే మన మొబైల్ కు,మెయిల్ కి మెసేజ్ లు వస్తాయి.*
💥SECTION B
_*Changes or corrections in Nomination Details*_
*1. గతములో ఇచ్చిన NOMINEE లను మార్చుకోవాలి అన్నా, గతములో పెళ్లి కాకుండా ఇపుడు వివాహం అయి వారి SPOUSE లను NOMINEE లుగా మార్చాలి అన్నా, గతములో పిల్లలు లేకుండా కొత్తగా పిల్లలను నామినీలు గా నమోదు చేసుకోవాలి అన్నా S-2 ఫారం తప్పని సరిగా దరఖాస్తు చేసుకోవాలి.*
*(గరిష్టంగా ముగ్గురిని మాత్రమే నామినీలుగా ఉంచడానికి అవకాశం ఉంటుంది.మరియు వారికి కేటాయించిన percentage ల మొత్తం 100 కు సరిపోవాలి.ఒక వేళ నామినీ మైనర్ ఐనట్లైతే వారి సంరక్షకుల వివరాలు నమోదు చేయాలి.)*
💥SECTION C
_*Reissue of T Pin or I PIN*_
*1. _మనకి PRAN కిట్ వచ్చినపుడు ఇచ్చిన IPIN, TPIN లను కనుక పోగొట్టుకున్నా ,తిరిగి వాటిని పొందాలి అంటే S2 ఫారం తప్పని సరి.*
SECTION D
_*Reissue of PRAN Card*_
*మనకి వచ్చిన PRAN కిట్ లను మనం పొందనపుడు, PRAN కార్డ్ ను పోగొట్టుకున్నా తిరిగి వాటిని పొందాలి అంటే S2 ఫారం తప్పనిసరి.*
*➡️ఒకవేళ ఉద్యోగితో రిజిస్టర్డ్ మొబైల్ ఉన్నట్లయితే OTP తో లాగిన్ అయ్యి మొబైల్ నెంబర్,Email ID, పాన్ నంబర్,బ్యాంక్ డీటెయిల్స్,డూప్లికేట్ PRAN కార్డ్ కొరకు అప్లై చేయడం చేయడం మొదలైనవాటిని ఆన్లైన్ లో కూడా చేయవచ్చు.*
Click here to download S2 form
0 వ్యాఖ్యలు:
Post a Comment