Friday, July 7, 2023

ఉద్యోగ,ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సర్వీసు అంశాలు

 *📡ఉద్యోగ,ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సర్వీసు అంశాలు:✍️*


 *➡️లీను:* ఒక పోస్టుపై ప్రభుత్వ ఉద్యోగి కి ఒక నియమిత కాలం వరకు గల హక్కు.ఇది శాశ్వత పోస్టు లేదా టెన్యూర్ పోస్టు అయినా ఉంటుంది. FR-9(13)


 *➡️ఫారిన్ సర్వీసు:* ఒక ఉద్యోగి ప్రభుత్వ అనుమతితో సంచిత నిధి నుండి కాక,ఇతర వనరుల ద్వారా భత్యo పొందుతూ చేయు సేవ. FR-110-127 


 *➡️45 సం॥ నిండిన వారు కనీసం* సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకొని వారికి ప్రమోషన్ కల్పించవచ్చు.

(G.O.Ms.No.225 GAD Dt:!18-05-1999)


 *➡️ఉద్యోగిని సరైన కారణాలు* లేకుండా సస్పెండ్ చేస్తే,దానికి బాధ్యుడైన అధికారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టవచ్చు.

(Memo.No.2213/Ser.C/93-6 GAD Dt:30-11-1996)


 *➡️ఉద్యోగిని సస్పెన్షన్ లో గరిష్ఠంగా 2 సం॥ మించి ఉంచరాదు.*

(U.O.Note.No.2776/SCE/98-1 GAD Dt:03-12-1998)


*➡️సస్పెన్షన్* మూలంగా ఏర్పడిన ఖాళీని వేరే వారితో భర్తీచేయరాదు.

(G.O.Ms.No.189 GAD Dt:20-04-1999)


 *➡️వికలాంగ ఉద్యోగులకు*  కన్వేయన్స్ అలవేన్స్ ను CL మినహా ఏ రకమైన సెలవులో ఉన్నా లేదా దసరా,సంక్రాంతి,వేసవి సెలవుల కాలంలోనూ కాన్వేయన్స్ అలవెన్స్ చెల్లించరాదు.

(G.O.Ms.No.226 Dt:05-09-1981)


 *➡️సరెండర్ లీవు* (Surrender Leave) కాలానికి పూర్తివేతనం,ఇతర అలవెన్సులు మంజూరు చేయబడతాయి.IR చెల్లించబడదు. తెలంగాణ ఇంక్రిమెంట్ చెల్లించబడుతుంది.

(Memo No.31948 F&P తేది:12-08-1998)

(Memo No.3572/107/A1/Admn.I/2014 Dt:15-12-2014)


 *➡️మృత శిశువు* జన్మించినా,జన్మించిన తరువాత శిశువు మరణించినా ప్రసూతి  సెలవు (Maternity Leave) కు అర్హులు.

(L.Dis.No.1941 Dt:11-06-1990)


 *➡️ప్రసూతి సెలవులో  (Maternity Leave)* ఉండి బదిలీ,పదోన్నతి పొందిన సందర్భంలో లీవ్ పూర్తయిన అనంతరం నూతన పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది.

(Rc.No.29 Dt:25-01-2003)

(Rc.No.3750 Dt:13-08-2009)


 *➡️కారుణ్య నియామకాలలో* భాగంగా 18 సం॥ కన్నా తక్కువ వయస్సున్న వారిని ఉద్యోగంలో నియమించుటకు అలాగే 34 సం॥ మించియున్న వయస్సు వారిని ఉద్యోగంలో నియమించుటకు అవకాశం లేదు.అయితే భార్య/భర్త లకు ఉద్యోగం ఇచ్చు సందర్భంలో వారి గరిష్ట వయస్సు 45 సం॥ గా నిర్ణయించడం జరిగింది.

(G.O.Ms.No.759 GAD Dt:06-10-2007)

(G.O.Ms.No.144 GAD Dt:15-06-2004)


 *➡️సస్పెండ్ అయిన ఉద్యోగికి  జీవనాధార భత్యము* (Subsistence Allowance) తిరస్కరించరాదు.అట్టి చెల్లింపులు తిరస్కరించడం శిక్షించదగ్గ నేరం.

(Govt.Memo.No.29370/A/458/FR-II/96 F&P Dt:14-10-1996)

0 వ్యాఖ్యలు:

Post a Comment

Latest Updates

Search This Blog

PRC-2020

Softwares

MODEL PROCEEDINGS/ PROFORMAS



Medical Reimbursement



ROSTER



DA

EXAMS- SYLLABUS- RESULTS



Top