Tuesday, November 10, 2026

subsistence allowance (50%) to the employee who has been suspended

*అవినీతి ఆరోపణలతో సస్పెండైన ఉద్యోగులకు జీవనభృతి 50%కే పరిమితం.. తెలంగాణ ప్రభుత్వ కీలక ఆదేశాలు!*


* *అవినీతి, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, అక్రమ లంచం డిమాండ్ చేయడం లేదా స్వీకరించడం వంటి ఆరోపణలపై ప్రాథమికంగా కేసు ఉన్నట్లు నిర్ధారణ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు, సస్పెన్షన్ సమయంలో చెల్లించే జీవనభృతి (Subsistence Allowance)ను 50 శాతానికే పరిమితం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.*


* *ఈ మేరకు Memo No.96/I&E/2023, తేదీ 16.01.2024 ద్వారా అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో G.O.Ms.No.2, Finance (FR.II) Department, తేదీ 04.01.2006 ద్వారా FR 53(1)(ii)(a)లో చేర్చిన ప్రత్యేక నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని పునరుద్ఘాటించారు.*


* *ఈ నిబంధన ప్రకారం అవినీతి, నిధుల దుర్వినియోగం, అక్రమ ప్రతిఫలం డిమాండ్ చేయడం లేదా స్వీకరించడం వంటి ఆరోపణలపై ప్రాథమికంగా కేసు ఉన్నట్లు నిర్ధారణ అయితే, శాఖాపరమైన కేసు తుది నిర్ణయం వెలువడే వరకు జీవనభృతిని 50%కే పరిమితం చేయాలి.*


* *అయితే కొన్ని శాఖలు ఈ ప్రత్యేక నిబంధనను పాటించకుండా, ఏసీబీ నమోదు చేసిన అవినీతి కేసుల్లో కూడా జీవనభృతిని సాధారణ పద్ధతిలో 75 శాతానికి పెంచుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇది గత ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధమని పేర్కొంటూ, అన్ని సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు నిబంధనలను ఎటువంటి మినహాయింపు లేకుండా పాటించాలని ఆదేశించింది.*


* *సర్వీస్ లా పరంగా చుస్తే సాధారణ సస్పెన్షన్ కేసుల్లో నిర్దిష్ట పరిస్థితుల ఆధారంగా జీవనభృతిని పెంచే అవకాశం ఉన్నప్పటికీ, FR 53లోని ఈ ప్రత్యేక నిబంధన వర్తించే అవినీతి కేసుల్లో 50% పరిమితి విధించబడింది.ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్న విధంగా సంబంధిత ఆరోపణలపై prima facie case ఏర్పడిందా అనే అంశం ముఖ్యమైనది. అలాగే సస్పెన్షన్ అనేది శిక్ష కాదు. ఆరోపణలు తుది విచారణలో నిరూపితమయ్యే వరకు ఉద్యోగిని దోషిగా పరిగణించరాదు.*

0 వ్యాఖ్యలు:

Post a Comment

Latest Updates

Search This Blog

PRC-2020

Softwares

MODEL PROCEEDINGS/ PROFORMAS



Medical Reimbursement



ROSTER



DA

Promotions


transfers


gurukulam


Top