Tuesday, November 10, 2026

Retired MPDO's (Group One Officer) pension fixed at ₹8300/- under CPS

 *_రిటైర్డ్ గ్రూప్‌-1 అధికారి.. ఎంపీడీఓ పెన్షన్ నెలకు రూ.8300_*

CPS ఉద్యోగులకు నమస్కారం.

నేను May, 2025 లో రిటైర్ అయ్యాను. 

నెల క్రితం నాకు రావలసిన బకాయిలు అన్నీ adjust అయ్యాయి. (Court కు వెళితే తప్ప న్యాయం జరగలేదు).

 మీ అందరి సౌలభ్యం కోసం ఈ విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

 2007 నుండి 2025 వరకూ నా CPS amount Rs. 39,68,000 credit అయ్యాయి.

   నేను ఏం చేశానంటే STO, మణుగూరు వారిని సంప్రదిస్తే వారు NPS exit form ఇచ్చారు. (Online లో నుండి కూడా download చేసుకోవచ్చు)

   ఆ form లో Section G అనే కాలమ్ దగ్గర నేను గతంలో పనిచేసిన office DDO (MPDO, Aswapuram) వారి నుండి సంతకం & stamp తో STO office లో submit చేసాను .

1. PRAN no. (Original card) (వారి దగ్గరే ఉంచుకుంటారు)

2. PAN (జిరాక్స్) original చూపించాలి 

3. ఆధార్ (జిరాక్స్) ఒరిజినల్ చూపించాలి.

4. మన Bank account passbook (జిరాక్స్) original చూపించాలి.(Cancelled check) Account no. & IFSC code confirmation కోసం మాత్రమే 

5. ఒక ఫోటో 

6. Spouse ఆధార్, PAN 

7. Family members details 

  ఇవన్నీ పూర్తిచేసి ఇస్తే వారు submit చేశారు. 

రెండో రోజు మన account లో ఒక రూపాయి credit అవుతుంది. మనకు text msg, mail కు msg వస్తుంది.

  3 రోజుల్లో దాదాపు Rs. 23,00,000 నా account లో credit అయ్యాయి.

ఇంకో 40% కోసం నేను ఏం చేశానంటే:

Annuity Service Provider (ASP) కోసం 

ICICI life insurance option ఇచ్చాను. (15 providers ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలో మీ ఇష్టం. కానీ నాకు అన్ని విషయాలు చెప్పి, నా సందేహాలు తీర్చిన మంచి మిత్రుడు, ICICI insurance company, హనుమకొండ బ్రాంచ్ లో పనిచేస్తున్న శ్రీ రంజిత్ కుమార్ గారు నాకు మంచి సహకారం అందించారు)

  CPS 40% amount (15,94,000) నాకు ICICI లో credit అయ్యాయి. 

వచ్చే నెల నుండి (December 2026) నాకు ప్రతీ నెల Rs. 8,300 పెన్షన్ అందుతుంది. ఒకవేళ నాకు risk అయితే నామినీ కు 15,94,000 ఇస్తారు. 


మీ కోసం ICICI, హనుమకొండ బ్రాంచ్ రంజిత్ కుమార్ గారి సెల్ నంబర్ ఇస్తున్నాను. వారు మీకు అన్నివిధాలా సూచనలు ఇస్తారు 

(రంజిత్ గారు: 73866 76361)

మీకు ఇంకా ఏ సమాచారం కావాలన్నా నాకు whatsapp లో msg పెట్టండి. (గంటా వరప్రసాద్, Rtd MPDO, 9440756038)

Analysis by Prathap Reddy sir

        *_గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఒక రిటైర్డ్ ఎంపీడీఓకు సంబంధించిన పెన్షన్ వివరాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంపీడీఓగా పనిచేసిన ఒక అధికారి తనకు నెలకు కేవలం రూ.8,300 మాత్రమే పెన్షన్ రూపంలో అందనున్నట్లు వెల్లడించారు. ఈ సమాచారం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఒక ఉన్నతస్థాయి అధికారిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తికే నెలకు రూ.8,300 పెన్షన్ వస్తే, సాధారణ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతోంది. ఉద్యోగ జీవితమంతా ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగి, రిటైరైన అనంతరం కుటుంబ పోషణకు సరిపడా పెన్షన్ కూడా పొందలేని పరిస్థితి ఏర్పడితే వారి వృద్ధాప్య జీవితానికి ఆర్థిక భరోసా ఎక్కడ ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం మరోసారి సీపీఎస్ విధానంపై చర్చను ముందుకు తెచ్చింది. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌కు ఈ ఉదంతం మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. ఇదే అధికారి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్‌) పరిధిలో ఉద్యోగ విరమణ చేసి ఉంటే, ఆయన చివరి వేతనం, సర్వీసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే నా అంచనా ప్రకారం నెలకు  సుమారు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు పెన్షన్ పొందే అవకాశం ఉండేది. ఈ రెండు విధానాల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం ఉద్యోగుల భవిష్యత్తుపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ ఉదాహరణ స్పష్టం చేస్తోంది._*

      *_సీపీఎస్ విధానంలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగికి భవిష్యత్తులో ఎంత పెన్షన్ వస్తుందో ముందుగా ఖచ్చితంగా తెలియని పరిస్థితి నెలకొంది. మార్కెట్ ఒడిదుడుకులు, పెట్టుబడుల రాబడిపై ఆధారపడే పెన్షన్ విధానంలో రిటైరైన ఉద్యోగికి, ఆయన కుటుంబానికి ఆర్థిక భద్రతపై పూర్తి భరోసా ఉండటం లేదు. ఉద్యోగ జీవితమంతా ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగి, వృద్ధాప్యంలో కుటుంబ పోషణ కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం ఎంతవరకు సమంజసం? ఉద్యోగ విరమణ అనంతరం గౌరవప్రదమైన జీవితం గడపడానికి తగిన పెన్షన్ పొందడం ఉద్యోగి హక్కుగా భావించాలి._*

       *_అందుకే తెలంగాణ ఉద్యోగుల జేఏసీతో పాటు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్‌)ను పునరుద్ధరించాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. ప్రజా ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఉద్యోగ విరమణ జీవితానికి ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా గుర్తించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో సీపీఎస్ పరిధిలో రిటైరయ్యే వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఆర్థిక అభద్రతతో అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది._

-Maneti Prathap Reddy

0 వ్యాఖ్యలు:

Post a Comment

Latest Updates

Search This Blog

PRC-2020

Softwares

MODEL PROCEEDINGS/ PROFORMAS



Medical Reimbursement



ROSTER



DA

Promotions


transfers


gurukulam


Top