*_48 గంటలకు మించి జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే ఉద్యోగికి సస్పెన్షన్ తప్పదు!_*
*_తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఈ నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది!_*
_ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏదైనా క్రిమినల్ కేసులో అరెస్టయి 48 గంటలకు మించి పోలీసు కస్టడీలో లేదా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లయితే వారిని విధుల నుంచి సస్పెండ్ చేయడానికి ప్రభుత్వ సర్వీసు నిబంధనల్లో స్పష్టమైన నిబంధన ఇప్పటికే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న Civil Services (Classification, Control and Appeal) Rules, 1991 లోని Rule 8(2)(a) ఈ విషయాన్ని నిర్దేశిస్తోంది. ఈ నిబంధన ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి క్రిమినల్ అభియోగంపై లేదా ఇతర కారణాల వల్ల 48 గంటలకు మించి కస్టడీలో నిర్బంధించబడితే, అతను నిర్బంధించబడిన తేదీ నుంచే సస్పెన్షన్లో ఉన్నట్లుగా పరిగణించబడతాడు. దీనినే Deemed Suspension అంటారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో దీనిపై సమగ్ర వివరణ._
*_Rule 8(2)(a) -Original Provision:_*
*_“A Government servant shall be deemed to have been placed under suspension by an order of the authority competent to place him under suspension, with effect from the date of his detention, if he is detained in custody, whether on a criminal charge or otherwise for a period exceeding forty-eight hours.”_*
*_ఈ నిబంధనలో గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు:_*
_>ఉద్యోగి పోలీసు కస్టడీలో ఉన్నా, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నా ఈ నిబంధన వర్తిస్తుంది._
_>కస్టడీ కాలం 48 గంటలకు మించి ఉండాలి. అంటే సరిగ్గా 48 గంటలు ఉంటే ఈ నిబంధన వర్తించదు._
_>48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిర్ధారణ అయితే, సస్పెన్షన్ అనేది నిర్బంధంలోకి తీసుకున్న తేదీ నుంచే అమలులోకి వచ్చినట్లుగా పరిగణించాలి._
_>ఉద్యోగి బెయిల్పై విడుదలైనంత మాత్రాన సస్పెన్షన్ వెంటనే రద్దు కాదు._
*_కేవలం 48 గంటల కస్టడీ మాత్రమే కాదు, శిక్ష పడిన సందర్భంలోనూ ప్రత్యేక నిబంధన ఉంది!_*
_>Rule 8(2)(b) ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగికి క్రిమినల్ కేసులో నేరం రుజువై, 48 గంటలకు మించి జైలు శిక్ష విధించబడి, ఆ కారణంగా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించడం లేదా ఇతర తగిన చర్యలు తీసుకోనట్లయితే, శిక్ష విధించిన తేదీ నుంచి అతను సస్పెన్షన్లో ఉన్నట్లుగా పరిగణించబడతాడు._
_>అలాగే Rule 8(5) ప్రకారం సస్పెన్షన్ ఉత్తర్వులను కంపిటెంట్ అథారిటీ మార్చే వరకు లేదా రద్దు చేసే వరకు అమల్లో ఉంటాయి._
*_అందువల్ల ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ నిబంధనలను తెలుసుకోవడం అవసరం. 48 గంటలకు మించి కస్టడీలో ఉన్న సందర్భంలో సంబంధిత శాఖాధికారులు నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఉద్యోగి తన అరెస్టు, విడుదల, బెయిల్ తదితర వివరాలను తన పై అధికారికి వెంటనే తెలియజేయడం కూడా చాలా ముఖ్యం._*
*_-మానేటి ప్రతాపరెడ్డి._*

0 వ్యాఖ్యలు:
Post a Comment